మన రాష్ట్రం....... మన హక్కు

Published: Thursday June 03, 2021
బాలపూర్, జాన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర కొరకు ఎందరో ఆనాటి త్యాగధనుల సత్ఫలితాలు నేటి తరానికి మన రాష్ట్రం, మన హక్కుగా మారిందని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా 31వ డివిజన్ లోని తెలంగాణా తెలుగు తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... కార్పొరేషన్ లోని ప్రజలకు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో కరోనా మహమ్మారి వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడ అభివృద్ధిలో వెనుకడుగు వేయబోమని అలాగే ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అనే నమ్మకంతో, పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలను మరువలేనిది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి కాళోజీ కానీ, జయశంకర్ సార్ కానీ లాంటి మహానుభావులు త్యాగ ఫలితాలనీ చెప్పారు. డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ పోరాటం అమరవీరుల వల్ల ఆంధ్రుల చేతుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పరుచుకొని స్వయ పరిపాలనలో జీవనం గడుపుతున్న ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, సమాజంలో తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర లో అమలు చేస్తారు అప్పుడు బంగారు తెలంగాణనీ చెప్పుకోవచ్చని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డి ఈ అశోక్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ ఓ. చంద్రశేఖర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, ముత్యం లలిత కృష్ణ,లీక్కి మమతా కృష్ణారెడ్డి, ఏనుగుల రామ్ రెడ్డి, జరిగే భారతమ్మ కొమురయ్య భీమిడి స్వప్న జంగారెడ్డి, తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, రాళ్ల గూడెం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్స్, కోఆప్షన్ సభ్యులు అధికారులు, పార్టీ నాయకులు రాజ్ కుమార్, సుధాకర్, జెనిగా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.