దత్తుకు మెరుగైన వైద్యం అందించాలి

Published: Friday February 10, 2023
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 9 ఫిబ్రవరి ప్రజాపాలన :
ప్రమాదవశాత్తు గాయాలపాలైన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డి పెట్ కు చెందిన పట్టణ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తుకు మంచి వైద్య చికిత్స అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని నిర్మల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, హాస్పిటల్ చేరుకొని దత్తును పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.