సైబర్ నేరగాళ్ల పై యువతకు SI సంతోష్ సిబ్బంది అవగాహన సదస్సు.

Published: Friday October 07, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో యువతకి సైబర్ నేరగాళ్ల పై మరియు పలు అంశాల పై బూర్గంపహాడ్ SI సంతోష్ సిబ్బంది యువతకి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి.యువతకి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో వివరించారు. ఆన్లైన్లో మోసాలు గురించి ఏమైనా లింకులు పంపిస్తే ఆ లింకులను క్లిక్ చేయ వద్దని అంతేకాకుండా అపరిచితమైనటువంటి ఓటీపీలు వస్తే వాటి గురించి వివరాలు చెప్పవద్దని వారు యువతకు సూచించారు. అంతేకాకుండా ఆర్బిఐ నుంచి ఎటువంటి పోన్స్ కానీ ఓటిపి కానీ ఆర్బిఐ వారు పంపరని వారు చెప్పారు. ఆన్లైన్లో మోసాలు గురించి ఒకటికి రెండుసార్లు తెలిస్తేనే వాటిని క్లిక్ చేయాలి గానీ అనవసరంగా పంపించే ఓటీపీలను మరియు మెసేజ్లను నమ్మవద్దని వారు యువతకు సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని వారు యువతకు సూచించారు.  అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలు నడిపెప్పుడు హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకోవాలని త్రిబుల్ రైడింగ్ చేయొద్దు అని ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపోద్దు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో SI సంతోష్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నాగయ్య,కానిస్టేబుల్ సాగర్ మరియు యువత ఉన్నారు. 
 
 
 
Attachments area