రైతు బీమా పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది: వ్యవసాయ విస్తరణ అధికారులు

Published: Friday March 11, 2022
బోనకల్, మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాయన్నపేట, రావినూతల గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు నాగినేని సాయి, మురికిపూడి తేజ రైతు భీమా పంచనామా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాయన్నపేట, రావినూతల గ్రామాలలో యంగల ఏసు తండ్రి గోపయ్య, గమిడి జమాల్ తండ్రి పెద్ద కోటయ్య అనే రైతులు ఇటీవల గుండె పోటు తో మరణించడం జరిగింది. సదరు రైతులు, రైతు భీమా కి అర్హులైనందున వారి యొక్క నివాసం వద్ద పంచనామా నిర్వహించడం జరిగింది. రైతు భీమా పథకం, రైతులకు ఆర్ధిక భరోసాను కల్పిస్తోందని, గుంట భూమి ఉన్న భీమా కి అర్హత పొందవచ్చని, భీమా లో అర్హత పొందిన రైతు ఏ కారణం చేత అయిన మరణిస్తే నామినీకి 5 లక్షలు చెల్లిస్తారు. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులు అర్హులని, ఆధార్ కార్డ్ లో ఉన్న వయస్సు ను ప్రాతిపదికగా తీసుకోబడుతుందని, భీమా కి అర్హుడైన రైతు ఏ కారణం చేత అయిన చనిపోతే 10 రోజుల్లో నామినీ బ్యాంక్ ఖాతాలో 5 లక్షలు జమచేయబడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కిన్నెర వాని, కొమ్మినేని ఉపేందర్, ఉప సర్పంచు బోయినపల్లి కొండలు, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు షేక్ జానీ, పంచాయతీ కార్యదర్శి ఆకుల రేణుక, అంగన్వాడీ టీచర్లు, రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.