వయోవృద్ధుల సహాయార్థం ప్రత్యేక టోలీ హెల్ప్

Published: Wednesday June 02, 2021

జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యల జిల్లా, జూన్ 01, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లాలో వయోవృద్ధుల సహాయార్థం ప్రత్యేక టోల్ఫ్ హెల్ప్ లైన్ 14567 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో గోడప్రతులు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ రెండవ దశలో వ్యాపిస్తున్న కరోనా వైరన్ విషయంలో వయోవృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని, రోగనిరోధక శక్తి పెంచుకొనుటకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకోవాలని తెలిపారు. 60 సం॥లు పైబడి శ్వాసకోశ, కాలేయ, నరాల సంబంధిత వ్యాధులు, హృద్రోగం, మూత్రపిండ వ్యాధి, మధుమేహం, రక్తపోటు, కాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే మీటర్ దూరాన్ని పాటిస్తూ మాట్లాడాలని, నమూహాలకు దూరంగా ఉండాలని, తాకే వస్తువులను తరుచుగా శుభ్రం చేసుకోవాలని, తుమ్మినమ్ముడు, దగ్గినప్పుడు చేతిరుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలని, పౌష్టికాహారం తీసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని, వైరన్ వ్యాధి లక్షణాలు కలిగిన వారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఒళ్ళు నొప్పులు ఉన్నా లేకున్నా జ్వరం ఉన్నప్పుడు, ఏదైనా వ్యాధి మొదటి సంకేతాలు ఉన్నప్పుడు, యెడతెగని దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 104, మానసిక రుగ్మతలో బాధపడుతున్నా, తెలిసిన వారిని గుర్తించలేకపోవడం వంటి కారణాలకు ప్రత్యేక టోలీ హెల్ప్ లైన్ 08046110007లో సంప్రదించాలని తెలిపారు. వయోవృద్ధుల సహాయార్థం ఏర్పాటు  చేసిన టోల్ ఫ్రీ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ సంక్షేమ అధికారి ఉమాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు  పాల్గొన్నారు.