దోమలో కూల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన సర్పంచ్ రాజిరెడ్డి

Published: Monday May 24, 2021
పరిగి, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : యువత స్వంత గ్రామాల్లో వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు.. ఆదివారం దోమ మండల కేంద్రంలో ఎస్ ఎస్ కూల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్బంగా కూల్ వాటర్ యంత్రాలను పరిశీలించి దోమ మండల కేంద్రంలో కూల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసిన నిర్వాహకులు శ్రీశైలం. శ్రీకాంతులను అభినందించారు. రోజు రోజుకు మండల కేంద్రంలో పలు రకాల వ్యాపారాలు ప్రారంభం కావడంతో మండల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తున్నాయని సర్పంచ్ రాజి రెడ్డి  చెప్పారు. విమాయన. రైలు తిరుపతి దర్శనం టిక్కెట్లు కూడా ఇక్కడ బుక్ చేసుకునే ఇంటర్నెట్ కేంద్రాలు దోమలో ఉన్నాయన్నారు. నాణ్యమైన వాటర్ అందేలా చూడాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాలగౌడ్. వార్డ్ సభ్యులు లక్ష్మణ్ తెరాస నాయకులు నారాయణ. ఒడ్డె నర్సింలు నిర్వాహకులు పాల్గొన్నారు.