స్థాయి మరిచి మాట్లాడితే తగిన గుణపాఠం చెపుతాం

Published: Monday November 01, 2021
జడ్పీ చైర్మన్  పై విమర్శలు చేసే ముందు మీ భట్టి ని ప్రశ్నించండి మండల టిఆర్ఎస్ నాయకులు
మధిర అక్టోబర్ 31 ప్రజా ప్రతినిధి మధిర టిఆర్ఎస్ కార్యాలయం నాయకులు మాట్లాడుతూ ఉన్న వాస్తవాలు అని తెలుసుకోవాలిరాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల మంజూరు అధికారం స్థానిక ఎమ్మెల్యే గా మీకు ఉంది అలాంటి అప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్న ఫైల్స్ మీద నెలల తరబడి సంతకాలు పెట్టకుండా పెండింగ్ లో పెట్టుకోవడం ఏంటి అలానే మంజూరు అయి వచ్చిన చెక్కులను మీరు హైదరాబాద్ లో తిరుగుతూ చెక్కుల టైం అయిపోయే ముందు వచ్చి ఇవ్వడం ఏంటిమీరు టైం ఇచ్చి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులు వచ్చిన రెండు గంటల తర్వాత రావడం అప్పటి వరకు గర్భిణీ స్త్రీలను, చంటి పిల్లల తల్లలను అలా వేచి డాల్సిందే అన్నట్లుగా ప్రవర్తించడం ఏంటి మీరు చేసే లేట్ కి వారు ఎందుకు బాధపడాలి అలానే మీరు రాకుండా క్రింద స్థాయి అధికారుల ద్వారా చెక్కులను పంచడం ఎందుకు అలా కాకుండా మీకు కుదరని పక్షంలో స్థానిక ఎన్నికల్లో ప్రజా తీర్పుతో గెలిచిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు వారి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయవచ్చుగా అని అడిగితే నియోజకవర్గంలో ప్రజల్లో నీ మీద వస్తున్న వ్యతిరేకత అలానే కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి వచ్చి నిన్ను గడ్డిపొరక లాగా చూస్తున్నారు అని మా నాయకులు మీద, పార్టీ క్యాడర్ మీద, లబ్ధిదారుల మీద మీ భట్టి అసహనం వ్యక్తం చేస్తూ గొడవ సృష్టించిన మాట వాస్తవం కాదాముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మీ భట్టి పోల్చుకోవడం ఎంత విడ్డురంగా ఉంది అంటే మధిర ప్రజల ఓట్లతో గెలిచి CLP పదవి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు నువ్వు ఏమి నాయకుడువి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి TRS పార్టీలో చేరారుఉన్న నలుగురు ఎమ్మెల్యేల కు మీ భట్టి ఓ లీడర్  అలాంటి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పోల్చుకొని మానసిక ఆనందం పొందడమే తప్ప ఏమీ లేద.మీరు ప్రభుత్వ కార్యక్రమంలో మా నాయకులకు సభ మర్యాదలు నేర్పడం ఏంటి అది ప్రభుత్వ కార్యక్రమం వేదిక మీద ఉంది అంత ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు స్థానిక ఎన్నికలు అంటే మీ భట్టి గారికి లెక్కల్లో ఉండవు కదా ఇటు తిరిగి కూడా చూడరు వాళ్లకు విలువ ఇవ్వరు కాబట్టి పక్కన వారు కూర్చుంటే తట్టుకోలేక అసహనం వ్యక్తం చేసి మళ్ళీ మాకు సభ మర్యాదలు నేర్పడం అని మాట్లాడడం మేము నిజంగా సభ మర్యాదలు పాటించకపోతే మీరు అందరూ అక్కడకి వస్తారా. అయిన అభివృద్ధి అంటున్నారు మీ భట్టి ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత మధిర కి చేసిన అభివృద్ధి ఏంటి.. కనీసం మధిర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేసిన కృషి ఏంటి చెప్పగలరా... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పల్లెల్లో రైతాంగానికి రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, పండించిన పంటను ప్రభుత్వం నేరుగా రైతు దగ్గరకు వెళ్లి కొనడం అలానే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందించే పింఛన్లు భారీగా పెంచి ఎన్ని ఇబ్బందులు ఉన్న వారికి టైం కి ఇవ్వడం అలానే పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందించడం, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్టు లాంటివి ఇవ్వడం, దళితులకు దళిత బందు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి అద్భుత కార్యక్రమాలు తో పాటుగా గ్రామాల్లో పట్టణాల మాదిరిగా ప్రతి పంచాయితీకి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ ఏర్పాటు తో పాటుగా ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టడం, గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఎక్కడ దహనం చెయ్యాలో తెలియని పరిస్థితి నుండి ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం ఏర్పాటు, చెత్త కోసం డంపింగ్ యార్డ్ లాంటివి ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మాట వాస్తవం కాదా...ఇవి అన్ని అమలు చేయడం ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడం మీకు, మీ భట్టి కి ఇష్టం లేదు అనే మాట వాస్తవం కాదా. ఇవి అన్ని చూస్తున్న ప్రజల్లో మీ భట్టి పట్ల వ్యతిరేకత పెరిగి వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలి అని ఉంటే అది గ్రహించి మీరు అసహనం తో అడ్డుగోలుగా మాట్లాడుతూ.గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే  మీ మీద తిరగబడి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం..మా నాయకులు కమల రాజు గారికి సహనం లేదు అంటున్నారు నిజంగా అదే లేకపోతే మీరు ఈ రోజు ఇలా మాట్లాడే పరిస్థితి ఉంటుందా.. మొన్న జరిగిన సంఘటన ల్లో లబ్ధిదారులు, ప్రజలు నిలదీసి అడుగుతుంటే పిల్లి లాగా అక్కడ నుండి ముందుగా జారుకుంది మీ నాయకుడు భట్టి, మీరు అనేది గుర్తు చేసుకోవడం మంచిది. విలేకరుల సమావేశంలో మండల TRS పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ అప్పారావు, సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి, TRS సోషల్ మీడియా ఇంచార్జ్ తాళ్ళూరి హరీష్ బాబు, జెవి.రెడ్డి, కొఠారి రాఘవరావు, చిన్నం వెంకటరెడ్డి, ఆళ్ల నాగబాబు, రమేష్ తదితరులు ఉన్నారు.