*పేదోని గూడు కోసం ఎర్రజెండా పోరు* - ఇండ్లు లేని పేదవారికి ఇండ్లస్థలాల పట్టాలు ఇవ్వాలి. - అరెస్

Published: Wednesday February 15, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 14 (ప్రజాపాలన):-

నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అనిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాంబశివరావుపోలీసులను ప్రశ్నించారు,
. రంగారెడ్డి జిల్లా  చేవెళ్ల మండల కేంద్రంలో
భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో వందలాదిమంది నిరుపేదలు ప్రజలతో
చేవెళ్ల మార్కెట్ యార్డులో సభ ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కూణంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ఎన్నో సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చి పేదలకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్న ఏ ఒక్క పేదవాడికి ఇంటి స్థలం రాలేదని అందుకోసమే మేము ఎర్రజెండాలు చేత పట్టించి భూ పోరాటాలకు అర్థమయ్యారని, ఆయన తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిరుపేదలు ఇళ్ల  స్థలాలు ఇవ్వాలని ఎర్రజెండాలు పాతి గుడిసెలు వారిని
పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
చేతనైతే ఈ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలి కానీ పేదల తరఫున పోరాడుతున్న కమ్యూనిస్టులను అరెస్టులు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
అక్రమ అరెస్టులతో భూ పోరాటాలను ఆపడం ఎవరి అబ్బ తరం కాదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే స్వాగతిస్తాం కానీ ఇవ్వకుండా మోసం చేస్తే ఎదురు తిరిగి పేదవాలను కూడగట్టి ఎర్రజెండాలు చేతబట్టించి భూ పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యమని ఆయన విమర్శించారు.
భూ కబ్జాదారులు వందలాది ఎకరాలను కబ్జాలు చేస్తున్న పట్టించుకోని పోలీసులు
అధికారులు,ప్రభుత్వ  కాలి స్థలంలో
పేదవాడు ఇ ళ్ళుకట్టుకుంటే  తక్షణమే అరెస్టులు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ప్రభు లింగం మండల కార్యదర్శిలు సత్తిరెడ్డి సుధీర్ కే శ్రీనివాస్ జంగయ్య వడ్ల సత్యనారాయణ సుధాకర్ గౌడ్ సుభాన్ రెడ్డి మక్బూల్ మాధవి మంజుల శివ శివయ్య నాగర్ కుంట ఉపసర్పంచ్ రఘురాం అనసూయ తదితరులు పాల్గొన్నారు.