నష్టపోయిన మిర్చి రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి

Published: Monday November 29, 2021
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు 
బోనకల్, నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మిర్చి పంటలో కొత్తరకం వైరస్ సోకి నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు డిమాండ్ చేశారు. మోటమర్రి గ్రామంలో బుర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏ ఐ కె ఎస్ బోనకల్ మండల 13వ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం కొత్త రకం వైరస్ కి మిర్చి పంటలు మొత్తం తీవ్రంగా నాశనం అయ్యాయని మిర్చి వేసిన రైతు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తరకం వైరస్ నివారణకు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు నాసిరకంను కొనక పోవటం వల్లనే ఈ నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామాలలో నష్టపోయిన మిర్చి రైతుల వివరాలు తెలుసుకొని వారి పెట్టబడును లెక్కించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సంఘం మహాసభ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నుకోవడం జరిగింది. మోటమర్రిలో జరిగిన 13వ మహాసభలో 11 మందితో కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఏలూరు పూర్ణచంద్రరావు, చెక్కుల రామారావులను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా నాయకులు తూము రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.