కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రికి మోక్షం ఎప్పుడు

Published: Monday June 07, 2021
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్ డిమాండ్
కోరుట్ల, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో నెలకొల్పవల్సిన వంద పడకల ఆసుపత్రికి మోక్షం ఎప్పుడని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ డిమాండ్ చేశారు. కోరుట్లలోని సి.ప్రభాకర్ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష, ప్రజాసంఘాల జేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుట్ల రెవెన్యూ డివిజన్గా, నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతున్నప్పటికి అరకొర సౌకర్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని పేట భాస్కర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు ఆర్భాటంగా వంద పడకల ఆసుపత్రికి శిలఫలాకం వేశారు తప్ప ఇంతవరకు అమల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన ఈ ప్రాంతంలో పర్యటించినున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి వంద పడకల ఆసుపత్రికి మోక్షం కల్పించి కరోనా కష్టకాలంలో ప్రజలను అదుకోవల్సిందిగా కోరుతు ఈ నెల 9, 10, 11 తేదీ లలో నిరసన దీక్షలు చేపడుతమన్నారు. సిపిఐ నేత చెన్న విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చింత భూమేశ్వర్, సుతారి రాములు, తిరుమల గంగాధర్, ఎం డి అక్బర్, ఏలేటి మహిపాల్ రెడ్డి, రాసకొండ పెద్ద దేవయ్య, ఓటర్కారి శ్రీనివాస్, పాతర్ల విజయ్, షాహిద్ మహ్మద్ షేక్, సత్యం, శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.