జర్నలిస్టుల హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలి** టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు నగ

Published: Tuesday August 30, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు29 (ప్రజాపాలన, ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో  టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ కు సంఘం జిల్లా నాయకులు పుష్పగుచ్చం అందజేసి  ఘన స్వాగతం పలికారు.
 అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం అనేక పోరాటాలు చేస్తుందన్నారు. జర్నలిస్టులు అనేక సమస్యల తో సతమతం అవుతున్నారని ప్రభుత్వాలు మాత్రం జర్నలిస్టుల సంక్షేమం విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం కొరకై ప్రభుత్వం ప్రకటించిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయం  జర్నలిస్టులకు వేదికగా నిలుస్తూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, నాయకులు సంపత్ కుమార్, సదానంద్, తిరుమల చారి, ప్రకాష్ గౌడ్, అడప సతీష్, సురేష్ చారి, దేవునూరి రమేష్, వారణాసి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.