కారో బోర్లకి ప్రత్యేక స్టేటస్ కావాలి బట్ట విజయ్ గాంధీ. బూర్గంపాడు ( ప్రజా పాలన)

Published: Monday November 21, 2022
గ్రామ పంచాయతీలలో పని చేస్తున్నటువంటి కారోబార్లు ప్రత్యేక స్టేటస్ ఇప్పించుట మరియు వేతనాలు పెంచుట గురించి బట్టా విజయ్ గాంధీ  ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ  కారోబార్స యూనియన్ అధ్యక్షుడు మేక.వెంకట నర్సయ్య గ డిసిసి-సభ్యులు& ఎమ్మెల్యే పోదేం.వీరయ్య  వినతి పత్రం అందజేసిన పంచాయతీ సిబ్బంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 30 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12000 మంది గ్రామపంచాయితీలలో పని చేస్తున్న కారోబార్లు ఇంటిపన్ను వసూలు చేయడం, గ్రామపంచాయితీలోని 30 రకాల రికార్డుల నిర్వహణ,శానిటేషన్ నిర్వహణ,త్రాగు నీరు,మురికి కాలువల నిర్వహణ,వీధి దీపాల నిర్వాహణ గ్రామ పంచాయితీ కార్యదర్శికి విధులలో అతనికి అసిస్టెంట్ గా పనులు చేయడం,గ్రామసర్పంచ్ కు,కార్యదర్శులకు,ప్రజలకు వారదిలాగా ఉండడం మరియు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పధకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేయుటలో కారోబార్ల పాత్ర కీలకం,24 గంటలు గ్రామంలో అందుబాటులో ఉంటున్నది కారోబార్లు మాత్రమే...
కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన జివో నెం 51 తేది: 14.10.2019 ద్వారా గ్రామ పంచాయతీలో పని చేస్తున్న వారందరూ కూడా మల్టీ పర్పస్ వర్కర్లుగా పని చేయాలని 51 జి.వో రావడం వల్ల రికార్డుల నిర్వహణ చేయవలసిన కారోబార్ల  గ్రామపంచాయితీ శ్రీ కార్యదర్శికి అసిస్టెంట్ పంచాయితీ కార్యదర్శిగా నియమించగలరని గ్రామ పంచాయితీలలో పని చేస్తున్న సిబ్బంది అందరికి కూడా కనీస వేతనం 15,500 రూ ఇవ్వగలరనీ మరియు గ్రామ పంచాయితీ కారోబార్లకు కనీస వేతనం 20,500 రూ,రాష్ట్ర ప్రభుత్వం పైన తెలిపిన విషయాలపై మాకు తగిన న్యాయం జరిగే వరకూ మీ వంతుగా మాకోసం పోరాటం చేయాలని డిసిసి సభ్యులు ఎమ్మెల్యే శ్రీ పొదేం.వీరయ్య గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది..
ఈ కార్యక్రమంలో
అధ్యక్షుడుమేక.వెంకటనర్సయ్య,
గౌరవ అధ్యక్షులు ఏనుగుల.వెంకన్న, రెడ్డి మల్ల బిక్షం,ప్రధాన కార్యదర్శి నల్లమోతుల.పూర్ణచంద్రరావు,
పుట్టి.రాజేష్,ఇట్టబోయిన శ్రీకాంత్,చుక్క క్రిష్ణ ప్రసాద్,నల్లబోతు.అనిల్ పెంకె దారుగా శైల లక్ష్మణ్ రావు,నక్కా నర్సింహారావు కువ్యారపు రామకృష్ణ,తాటి.రామారావు,ఎల్లబోయిన,నర్సింహారావు,కోటమర్తి రామకృష్ణ జమ్మీ సాయి రామ్ ఆవులూరి రాంబాబు సుంకర క్రిష్ణప్రసాద్ చెన్నారావు,శ్రీను తాటి.కృష్ణ,విజయ భాస్కర్,చైతన్య తదితరులు పాల్గొన్నారు....