పది రూపాయల నాణేలపై అవగాహన కల్పించండి

Published: Wednesday April 21, 2021

బెల్లంపల్లి ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి: పది రూపాయల నోట్లు ఎక్కువగా వినియోగంలో ఉండి త్వరగా చిరిగిపోయి పాడై పోతున్నాయి అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన పది రూపాయల నాణేలకు బెల్లంపల్లిలో పరేషాన్ వచ్చిపడింది. ఎవరు చెప్పారో ఏమో కాని ఒకరిని చూసి ఒకరు నాణలను తీసుకోవడం లేదు. బెల్లంపల్లిపట్టణ లో వినియోగదారులు మార్కెట్ లోకి వెళ్లి కూరగాయల వద్ద గాని టిఫిన్ సెంటర్ల వద్ద గాని కిరాణా కొట్లో గాని మద్యం షాప్ ల వద్దగాని చివరకు మల్లెపూలమ్ముకునే వాళ్లు గాని, పది రూపాయల నాణాన్ని తీసుకోవడం లేదు, వస్తువులను కొనుగోలు చేసుకున్న తర్వాత పది రూపాయల నాణేలు ఇస్తే అది తప్ప వేరే ఇయ్యండి అంటూ పది రూపాయల నాణాలను తీసుకోవడం లేదు, ఇది ఏంటమ్మా రిజర్వు బ్యాంకు వారు ఈ నాణాలను నిషేధించలేదు కదా తప్పకుండా తీసుకోవాల్సిందే అని విజ్ఞప్తి చేసిన గదంతా మాకు తెలియదు సార్ వాటిని ఎవరు తీసుకుంట లేరు మేము కూడా తీసుకోము అవి వద్దు సార్ అంటూ నిర్ద్వందంగా ఇచ్చిన సామాన్లను వెనక్కి తీసుకుంటున్నారు, బ్యాంకుల వాళ్ళు, పెట్రోల్ పంపుల వారు తప్ప ఎవరు తీసుకోవడం లేదు నాణాలను, ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుల వద్ద ఉన్న వందలాది రూపాయల పది రూపాయల నాణేలు గల్లాపెట్టె లోను దేవుడి హుండీల్లోనో ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందినీ వినియోగదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో నైనా మార్చుకుందామని వెళ్తే బ్యాంకులో ఖాతాదారులై వుంటే రోజుకు ఒక వెయ్యి రూపాయల నాణాలు మాత్రమే తమ ఖాతాలో జమ చేసుకొనే అవకాశం ఉందని ఎక్కువగా తీసుకోలేమని బ్యాంకు అధికారులు అంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఈ బాధలు భరించలేక హుండీ ల్లోనో గల్లా పెట్టెల్లో నో  వేసుకుని ఇంట్లోనే దాచి పెట్టుకోవడం జరుగుతుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై వెల్లంపల్లి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ వై వి రెడ్డి ని అడగగా రిజర్వు బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క ఖాతాదారుడు రోజుకు ఒక వెయ్యి రూపాయలు తన ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఉందని అంతకంటే మించి చేసుకునే అవకాశం లేదని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటికైనా  బెల్లంపల్లి పట్టణంలో 10 రూపాయల నాణాన్ని వినియోగంలోకి వచ్చే విధంగా అందరూ తీసుకునే విధంగా రెవెన్యూ అధికారులు చేస్తారో, మున్సిపల్ అధికారులు చేస్తారో, పోలీస్ అధికారులు చేస్తారో, బ్యాంకు అధికారులు చేస్తారో ఎవరు చేస్తారో ఏమో కానీ 10 రూపాయల నాణాన్ని బెల్లంపల్లిలో భయం లేకుండా తీసుకొనే ఈ విధంగా అవగాహన కల్పించాలని లేదంటే బెల్లంపల్లి పట్టణంలో పది రూపాయల నాణమ్ కనుమరుగయ్యే ప్రమాద ముందని   అంటున్నారు.