*ప్రభుత్వ జి ఒ ప్రకారం వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.*

Published: Wednesday December 28, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 27, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  ప్రభుత్వ దవాఖానలో  వివిధ విభాగాలలో పనిచేస్తున్న వర్కర్లకు  కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా , జి ఒ నంబరు. 60 ని అమలు చేయకుండా  ఇష్టరితిన వేతనాలు చెల్లిస్తూ, పి ఎఫ్, ఇఎస్ఐ పూర్తిగా చెల్లించడం లేదని, యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ మంగళవారం  ప్రభుత్వ ఆసుపత్రి  సూపరింటెండెంట్  వినతిపత్రం అందించిన దుంపల రంజిత్ కుమార్   సి ఐ టి యు జిల్లా కార్యదర్శి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్కర్లు అందరికీ చేయించాలని   కోరుకుంటూ, వెంటనే పలు సమస్యలు పరిష్కరించి వర్కర్లకు న్యాయం చేయాలని  లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  రాకేష్,ఫయాజ్,స్వరూప,రజిత తదితరులు పాల్గొన్నారు.