కెసిఆర్ జూట మాటలు, నిరుద్యోగ జీవితాలతో ఆటలు: బీజేపీ యువ నాయకులు బీపీ నాయక్

Published: Tuesday December 28, 2021
బోనకల్, డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి: నేడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు బిజెపి యువనేత ఎన్నారై బిపి నాయక్ మద్దతుగా సంఘీభావం తెలిపారు. అనంతరం బిపి నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగ దీక్ష కు బయలుదేరుతున్న తనను అడ్డుకోవడం నిర్బంధించడం సిగ్గుచేటని అన్నారు. ఉద్యమ కాలం నుండి మొన్నటి ఉప ఎన్నికల వరకు లక్ష ఉద్యోగాలు, 50 వేల ఉద్యోగాలు అనే ఉత్త ఊపు దమ్ముడు మాటలతో కెసిఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటోందనీ, ఎంతోమంది యువత బలిదానాలను ప్రేరేపించింది ఖచ్చితంగా దొంగ మాటలే అని, రాష్ట్రంలో ఏటా నిరుద్యోగం పెరిగిపోతున్నదనీ త్వరలోనే నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండరు, లక్ష ఉద్యోగాలు అంటూ కేటీఆర్ నిరుద్యోగ భృతి కూడా కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మి తెలంగాణ యువత టిఆర్ఎస్ మాయలో పడ్డారనీ, ఇకనైనా మేల్కొని నిరుద్యోగులు అంతా ఏకమై ఎక్కడికక్కడ టిఆర్ఎస్ నాయకులను నిలదీయాలని యువతకు భరోసా నింపేందుకు వారి పక్షాన నిలబడి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.