ముస్లిం మైనారిటీ ప్రజలకు శ్మశానవాటికకై 2ఎకరాలు కేటాయించిన మంత్రి మల్లారెడ్డి

Published: Tuesday April 04, 2023
మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిధి): ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి 1వ వార్డు కొండాపూర్ లో  సర్వే నంబర్ 152 లో గలా 2 ఎకరాల భూమిని ఘట్కేసర్  మున్సిపాలిటీ లోని ముస్లిం మైనారిటీ ప్రజలకు స్మశానవాటిక కోసం కేటాయిస్తూ ముస్లిం మత పెద్దలకు అందించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ముందుగా ఘట్కేసర్ మున్సిపల్ పట్టణ ముస్లిం ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మంత్రికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు, ఘట్కేసర్ మున్సిపల్ ముస్లిం మొయినార్టీ ప్రజల చిరకాల కోరిక నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అదేవిధంగా ఈ రోజు నుండి స్మశానవాటిక అభివృద్ధి కోసం 25 లక్షల నిధులు విడుదల చేసి స్మశానవాటికలో కావల్సిన మొరం (మట్టి) పొపించేందుకు అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మా పాలక వర్గం సహకారం తో  కృషి  చేస్తామని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని కులాల వారికి స్మశానవాటికలు సుందరికారణ, అభివృద్ధి చేస్తున్నారని. అదేవిధంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ని ప్రజలు మరల గెలిపించుకొని మన ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రికి ఏళ్ల వేళలా తోడు ఉంటూ వారిని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లానని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి , బండారి ఆంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, సల్లూరి నాగజ్యోతి నర్సింగ్ రావు, బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, కడుపొల్లా మల్లేష్, జహంగీర్, బేతల నర్సింగ్ రావు, కుతాది రవీందర్, కో-ఆప్షన్ సభ్యులు బొట్టు అరుణ కృపనిది ,బొక్క సురేందర్ రెడ్డి,  మొయినార్టీ అధ్యక్షుడు కుతుబ్, మొయినార్టీ నాయకులు కయుమ్, అన్ను, ముస్లిం మత పెద్దలు, ముస్లిం మజీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు, బ్యాంకు డైరెక్టర్ లు, ఆలయ డైరెక్టర్ లు,BRS పార్టీ ప్రధాన కమిటీ సభ్యులు,BRS పార్టీ అనుబంధాలకమిటీ అధ్యక్షులు,కార్యదర్శులు కమిటీసభ్యులు గారు,BRS పార్టీ యువజన నాయకులు,BRS పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు   BRS పార్టీ వార్డ్ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు అభిమానులు,BRS పార్టీ కుటుంబ సభ్యులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.