బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు నుండి కింద పడిపోయిన వ్యక్తి తీవ్ర గాయాలు శంకరపట్నం నవం

Published: Saturday November 26, 2022

శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొజ్జ కోటిలింగం తండ్రి బొజ్జ కొమురయ్య (65) శుక్రవారం  సైదాపూర్ వెళ్ళడానికి  కేశవపట్నం బస్ స్టాండ్ లో పల్లెవెలుగు బస్సు ఎక్కుతున్న క్రమంలో అదుపుతప్పి బస్సు నుండి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది  పైలెట్ కాజా, ఈఎంటి సతీష్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని  క్షతగాత్రుడిని కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
ప్రయాణీకులకు ఎంతో సురక్షితం గా వారి గమ్యస్థానాలకు చేరవేసే ఎంతో నమ్మకమైన సంస్ధ గా ఆర్ టీసీ ప్రజల మన్ననలను చూరగొన్నా విషయం విధితమే....అయినప్పటికి గత కొంత కాలం గా పెరుగుతున్న ప్రమాదాల వల్ల ఈ సంస్థ ప్రయాణికుల సురక్షిత ను నిర్లక్ష్యం చేస్తోందన్న అపవాదు లేకపోలేదు ముఖ్యముగా ఆర్టీసీ లో అద్ధే బస్సులు పెరిగిపోయి వాటి డ్రైవర్ ల నిర్లక్ష్యం వలన పోటీ తత్వం వలన బస్సులను వేగంగా నడపడం వల్ల ఆర్టిసి డ్రైవర్ లకు పని వేళలు పెంచడం వల్ల తరుచు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇందులో సంస్థ నిర్లక్ష్యం కూడా స్పష్టమవుతోంది, పల్లె వెలుగు బస్సుల తలుపులు పూర్తిగా తెరిచి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి,ప్రయాణికులు బస్సు ఎక్కుతున్న క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళుతుండడం వల్ల ప్రయాణికులు ఫట్ బోర్డ్ లో ఉండగానే డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అబిప్రాయపడుతున్నారు. ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ప్రయాణీకులు, ప్రైవేట్ వాహనదారులు,ప్రజలు ప్రమదాల బారీన పడుతున్నారు.తక్షణమే ఆర్ టి సి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు