ఇబ్రహీంపట్నం జూన్ తేది 5 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Monday June 06, 2022
మంచాల మండలంలో విస్తృతంగా పర్యటించిన  జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి*

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లోయపల్లి,కొర్ర వాని తండా, అంబోత్ తండా, బోడ కొండ, మంచాల  గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, స్మశానవాటికలు, మంకీ ఫుడ్ కోర్టు, లూజ్ వైర్స్  , విద్యుత్ స్తంభాలు, ఐరాన్ స్తంభాలు, అదనపు విద్యుత్ స్తంభాలు,మురుగు కాల్వలు,విది దీపాల మరమ్మతులకు    సంబంధించిన పనులను పరిశలించారు, ఈ సందర్భంగా మర్రి నిత్య నిరంజన్ రెడ్డి   మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని అధికారులను కోరారు, గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అర్హులైన  ఏ ఒక్కరికి పింఛను & రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు, ప్రభుత్వం ఎలక్షన్ లు ఉన్న  చోట తప్ప మిగిలిన  ప్రాంతాలలో  సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు, ప్రభుత్వం పథకాలలో సొంత పార్టీకే ప్రాముఖ్యత ఇస్తుందన్నారు, అర్హులైన నిరుపేదలకు పథకాలలో భాగస్వామ్యం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రంగారావు, అనంతరం మంచాల లో వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, లోయ పల్లి గ్రామంలో మురుగు కాలువలను రైతుల వ్యవసాయ పొలంలోకి వదలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు, ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు,మరియు  మండల ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు ,వివిధ శాఖల అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.