బహుజన రాజ్యాధికార సాధనకు దిక్సూచి కాన్షీరామ్

Published: Tuesday March 16, 2021
- దళిత శక్తి ప్రోగ్రాం సిద్దిపేట జిల్లా కన్వీనర్ కర్రోళ్ల రవిబాబు మహారాజ్.
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : బహుజనులు రాజ్యాధికారం సాధించడానికి బాటలు వేసిన మహనీయులలో కాన్షిరాం అగ్రగణ్యులు అన్నారు సిద్దిపేట జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కర్రోళ్ల రవిబాబు మహారాజ్. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 87 వ జయంతి సందర్భంగా.. DSP ఆధ్వర్యంలో... జిల్లా స్థాయి రాజ్యాధికార చైతన్య సభను నిర్వహించారు... ఈ రాజ్యాధికార చైతన్య సభలో DSP జిల్లా కన్వీనర్ రవిబాబు మహారాజ్ మాట్లాడుతూ.. మాన్యశ్రీ కాన్షీరామ్ 87 వ జయంతి సందర్భంగా.. DSP వ్యవస్థాపకులు డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు.. మార్చి-15-2021నుండి మార్చి-15-2022 వరకు 1 సంవత్సర కాలమంతా... 365 రోజులు తెలంగాణా రాష్ట్రం లో .. SC/ST/BC ల రాజ్యస్థాపన కై  రాజ్యాధికార చైతన్య సభలు జరపబోతున్నట్లు తెలిపారు.... SC/ST/BC  ప్రియమైన బంధువులందరికీ & పీడిత వర్గాలని ప్రేమించే ప్రజాస్వామ్య, ప్రగతిశీల వాదులకు కాన్షీరామ్ పేరు వింటే చాలు... ఆ మహనీయుని  దృశ్యాన్ని చూస్తే చాలు ఈ భూమండలాన్నే పరిపాలించే సింహాసనంపై కూర్చున్నట్టు ఉంటుందన్నారు. అంబేద్కర్ తర్వాత అంతటి ప్రభావం చూపే మరో వ్యక్తి  కాన్షీరామ్ అన్నారు. ఆయన ఫూలే, అంబేడ్కర్ ఆలోచనలకు ఆచరణాత్మక ప్రతి రూపం అని. అంబేడ్కర్ రాజ్యాధికార కలను చూపించనవాడే కాన్షిరామ్. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ చదివించిన విద్యావంతులను, ఉద్యోగస్తులను, అంబేడ్కర్ సిద్దాంతాన్ని ఈ మూడింటిని  పట్టుకొని సైకిల్ పై సమరాన్ని ప్రారంభించాడని తెలిపారు. ఓటు హమార రాజ్ తుమారా నహీ చలేగా.! నహీ చలేగా.! అనే ఒక నినాద అణుబాంబుని అగ్ర కులాల చేతిలో ఉన్న భారత రాజకీయాలలో పెట్టి పేల్చిన ఒక భారీ విస్పోటనానికి కారకుడయ్యాడు మన కాన్షీరామ్ అన్నారు.. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు రాజన్  మహారాజ్, సదన్ మహారాజ్, మరియు జిల్లా నాయకులు తదితరులు  పాల్గొన్నారు.