వీఆర్ఏల హామీలను నెరవేర్చాలి

Published: Thursday July 28, 2022
జిల్లా టిజెఏసి చైర్మన్  ముకుంద నాగేశ్వర్
వికారాబాద్ బ్యూరో 27 జూలై ప్రజా పాలన :
తెలంగాణ ప్రభుత్వము శాసనసభ వేదికగా వీఆర్ఏ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టిజెఏసి చైర్మన్  ముకుంద నాగేశ్వర్ డిమాండ్ చేశారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో వీఆర్ఏలు తమ న్యాయమయిన డిమాండ్ల సాధన కొరకు చేస్తున్న నిరవధిక సమ్మెకు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిండు  శాసనసభలో  గతంలో ప్రకటించిన విధంగా 2012 నుండి 2014 వరకు ప్రత్యక్షంగా ఏపీపీఎస్సీ  నియమించిన వీఆర్ఏల సర్వీస్ ను రెగ్యూలరైజ్ చేయడంతో పాటుగా పేస్కేల్స్ జీవోను తక్షణమే  ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏ లకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన వీఆర్ఏ లకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని సూచించారు.
అర్హత కలిగిన వీఆర్ఏ లకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి వీఆర్ఏ లకు ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చి శాసనసభ గౌరవాన్ని కాపాడాలని కోరారు.