విద్యుత్ శాఖ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 16, 2022
మధిర ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జన్మదిన వేడుకలు మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మధిర సబ్ డివిజన్ ADE సిహెచ్ సుధాకర్  అంబేద్కర్ మహాశయునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మధిర విద్యుత్ శాఖ రెవెన్యూ కార్యాలయ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ CH ప్రభాకర్, JAO రాజేశ్వరి, సబ్ ఇంజనీర్ లావణ్య, UDC బేగం, శ్రీధర్, కృష్ణకుమారి, బాబు, రవికుమార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.