చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకే రవి

Published: Monday June 20, 2022
జన్నారం రూరల్, జున్ 19, ప్రజాపాలన:  
 
ఆదివాసీలు, పేదలు ,చేతి వృత్తిదారులేదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27 న చేపట్టిన చలో మంచిర్యాల కలెక్టరేట్ ధర్నా విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకే రవి అన్నారు, 
ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములకు హక్కు పత్రాలివ్వకుండ ఆదివాసులపై ఫారెస్ట్ శాఖ అధికారులు దాడులు, దౌర్జన్యాలు చేయిస్తు అక్రమ కేసులు పెట్టి గిరిజనులను జైళ్లో పడేయడం జరుగుతుందని అన్నారు, పేదలకు సాగు భూములు, డబల్ బెడ్ రూం ఇండ్లు, పెన్షన్లు ఇవ్వడంలేదు. హక్కు పత్రాలు పట్టా పాస్ పుస్తాకలున్న భూములను కూడ గుంజుకొని ఫారెస్టు లో కలపడం జరుగుతుందని సూచించారు, పేదల భూములను ఇంటి స్థలాలను క్రీడా మైదానాల పేరుతో  గుంజుకోవడం జరుగుతుందని తెలిపారు, మందమర్రిలో సంవత్సరములు  గడిచిపోతున్నా తోళ్ళ పరిశ్రమను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదుని అయన అవేదన వ్యక్తపరచారు, ఈ కార్యాక్రమంలో  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరం అశోక్, జన్నారం మండల కార్యదర్శి గుడ్ల రాజన్న, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బి ప్రకాష్, ఎస్కే అబ్దుల్ల తదితరులు పాల్గొన్నారు.