విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై తేజావత్ కవిత

Published: Wednesday November 23, 2022

బోనకల్ ,నవంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మంగళవారం పోలీస్ డిపార్ట్మెంట్ , కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ నళినిశ్రీ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తేజావత్ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఎస్సై కవిత కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ర్యాగింగ్ వలన కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన శిక్షలు గురించి వివరించారు. విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు .ఈవ్ టీజింగ్,లైంగిక వేధింపులు,ఆన్లైన్లో అపరిచితుల ద్వారా జరిగే వేధింపులు ,సైబర్ క్రైమ్ గురించి వివరించారు. వీటికి గురైన విద్యార్థులు ఎవరైనా తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో పైకి రావాలని కోరారు . ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, ప్రభుత్వ కళాశాల సిబ్బంది, ఎస్ .ఎస్ .ఎస్.,పి.ఓ. రామకృష్ణ , అధ్యాపకులు జోనాథన్ బాబు, ప్రసాద్ బాబు, శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.