గ్రామాలలో పాజిటివ్ రేటు తగ్గించే దిశగా మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలక్టర్ ఆ

Published: Monday June 07, 2021

మధిర, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు పేటగ్రామాలలో పాజిటివ్ రేటు తగ్గించే దిశగా మండల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.ఆదివారం మధిర మండల మాటూరుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలక్టర్ సందర్శించారు. పీహెచ్ సి లలో టెస్టులను పెంచాలని అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగాలని మండల వైద్య అధికారులును ఆయన ఆదేశించారు. ప్రధానంగా నిరంతరం ఇంటింటి సర్వే నిర్వహిస్తూ పాజిటివ్ పేషంట్ లను గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలిoచి, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు, ఉచిత భోజన వసతి కల్పించాలని ఆయన సూచించారు. ఐసోలేషన్ కేంద్రాలలో పేషేంట్లను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పర్యవేక్షిస్తూ గ్రామాలలో పాజిటివ్ రేటును తగ్గించేందుకు అధికారులు కృషిచేయాలని ఆయన తెలిపారు. ప్రధానంగా ఐదు కేసులకంటే ఎక్కువ వచ్చిన గ్రామాలలో స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని కలక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం మాటూరుపేట లో ఈ ఎపి, తెలంగాణ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా ఆమలు చేయాలని, కేవలం అత్యవసరమైన వైద్య సేవలకు సంబందించిన వాహనాలను మాత్రమే అనుమతించాలని, అధికారికంగా ప్రేత్యేక అనుమతి పాసులు కలిగిన వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతంలో నిఘా ను మరింత పెంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అదేశించారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో జెడ్పి చైర్మన్ కమల్ రాజ్ తో కలసి ఆక్సిజన్ సెంట్రల్ లైన్ ను కలక్టర్ ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి, ఎన్. ఆర్.ఐ పేరెంట్స్ అసోషియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వితరణ చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మండల వైద్య అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎంఅండ్హెచ్ ఓ మాలతి, వైరా ఏసీపీ సత్యనారాయణ, మధిర తాసిల్దార్ సైదులు, ఎంపిడిఓ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపిపి లలిత, మునిసిపల్ చైర్ పర్సన్  ఎం.లత తదితరులు పాల్గొన్నారు.