మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Published: Tuesday September 20, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 19, ప్రజాపాలన: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించలని, సి ఐ టి యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్ ఎ ఒ కు వినతి పత్రం అంజేశారు.ఈ సందర్భంగా  జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, ప్రభుత్వమే ఉచితంగా కోడిగుడ్లను, గ్యాస్ సరఫరా చేయాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అసెంబ్లీ సమావేశాల్లో  మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయలు గౌరవ వేతనం పెంచుతున్నట్టు ప్రకటించిన నేటికీ ఆ జి ఒ ను విడుదల చేయలేదని,ప్రభుత్వం   వెంటనే ఆ జి ఒ ను విడుదల చేసి అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఇఎస్ఐ,  ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత  సౌకర్యం కల్పించాలని అన్నారు.లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సాంబలక్ష్మి, రబియా,విమల,శకుంతల,నర్సమ్మ, పద్మ,అంజలీ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area