నూర్ భాషా (దూదేకుల) సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు... -- ఎమ్మెల్యే డా. సంజయ్

Published: Monday October 10, 2022

జగిత్యాల, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ స్వాగత్ ఫంక్షన్ హాల్ లో జగిత్యాల పట్టణ నూర్ భాషా (దూదేకుల) సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపినారు. అనంతరం ఎమ్మేల్యే కార్యవర్గ సభ్యులు సన్మానించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రపంచ శాంతి కి కృషిచేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూర్ భాషా కులస్తుల్లో అత్యదికంగా పేద వారు ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధి కి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ని బలపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా వల్ల కొంత అభివృద్ధి ఆలస్యమైనా ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణ లో అభివృద్ధి చేసామని అన్నారు. మైనార్టీ ల కోసం మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని వాటిని ఉపయోగించు కోవాలని అన్నారు. నూర్ బాషా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొహమ్మద్ బాబు జానీ, హసీనా, సోకురా బి, జగిత్యాల అధ్యక్షులు అబ్దుల్ అజీమ్, కార్యవర్గ సభ్యులు, టిఆర్ఎస్ వి  పట్టణ అధ్యక్షులు ఎం.ఏ. ఆరీఫ్, సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area