జగిత్యాల పట్టణ అభివృద్ధి మా లక్ష్యం

Published: Saturday June 11, 2022

ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలో 4 వవిడత  పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 7, 8, 22  వార్డులలో వార్డులను సందర్శించి, పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వార్డుల్లో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ మొక్కలు నాటినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి లక్ష్యం గా పనిచేస్తున్నామని, కొత్త బస్టాండ్ లో 70 లక్షలతో అభివృద్ధి చేశామని, జగిత్యాల చుట్టూ 4 మార్కెట్ల అభివృద్ధి చేస్తున్నామని, ధరూర్ క్యాంప్ లో 18 లక్షల లీటర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామని అన్నారు. 1 లక్ష 40 వేల కిమీ భగీరథ పైప్ లైన్ పట్టణ ప్రజల కోసం వేస్తున్నామని, రోడ్లను అభివృద్ధి చేస్తున్నమని అన్నారు. టీస్ బిపాస్  ద్వారా ఇండ్ల అనుమతులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జోన్ల మార్పు ద్వారా 141 సర్వే నంబర్లు మార్పు చేయటం ద్వారా ఇండ్ల అనుమతులు లభిస్తున్నాయి అని అన్నారు. కోటి రూపాయలతో డిఆర్ సిసి కేంద్రం, మానవ వ్యర్థాల కోసం 2.5 కోట్ల తో  ఎఫ్ఎస్ టిపి నిర్మించామని, మహిళలు, యువత, పెద్దలు అందరూ కలిసి పట్టణ అభివృద్ధికి ఏకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు వనరాసి మళ్లవ్వ, తిరుమలయ్య, వల్లపు రేణుక మొగిలి,  పులి రమాదేవి, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, కమిషనర్ స్వరూప రాణి, డిఈ రాజేశ్వర్, కౌన్సిలర్ లు చుక్క నవీన్, క్యాదాసు నవీన్, బొడ్లా జగదీష్,కూతురు రాజేష్, గుగ్గిల్ల హరీష్, పంభాల రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు ధుమల రాజ్ కుమార్, పట్టణ యూత్ అధ్యక్షుడు కత్రొజ్ గిరి, పట్టణ ఎస్టీ సెల్ బిక్షపతి, మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు కట్ట పుష్ప, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, జేడి, అడువాల లక్ష్మణ్, సుధాకర్, శరత్ రావు, భోగఅరవింద్, మహేష్, ముఖేష్ ఖన్నా, కోటేశ్వర రావు, కోలగానీ సత్యం, పులి నర్సయ్య, సుమన్ రావు, అంజయ్య గౌడ్,క్రాంతి, ఏనుగుల రాజు, రాము, నాయకులు  కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.A