పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహా ఆహ్వాన పత్రిక గిఫ్ట్ గా గోడ గడియారాలు

Published: Wednesday July 27, 2022
పంపిణీ*మధిర జూలై 26 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలంలో రొంపిమల్ల, మల్లారం, జాలిముడి, రామచంద్రాపురం  గ్రామాల్లో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి*  కుమార్తె వివాహం సందర్భంగా ఖమ్మం నందు ఆగస్టు 17వ తేదీన జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రిక మరియు గిఫ్ట్ గా గోడ గడియారాలను ఆయా గ్రామాల సర్పంచ్ లకు, ఎంపిటిసి లకు మరియు గ్రామస్థులకు పంపిణీ చేసిన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు

ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ నాయకులు యన్నం కోటేశ్వరరావు , వేమిరెడ్డి లక్ష్మారెడ్డి , కటికల సీతారామిరెడ్డి , వెంకట్రామిరెడ్డి , శ్రీనివాసరెడ్డి , వెంకట్రామయ్య , మందడపు రామకృష్ణ , పీర్ సాహెబ్ , నలమల్ల సురేష్ , నాలమల్ల గోపి , కృష్ణారెడ్డి , నరసింహారావు  మరియు గ్రామస్థులు మరియు శ్రీనన్న అభిమానులు, నాయకులు పాల్గొన్నారు