ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి * టోర్నమెంట్ అశోక క్రికెట్ కప్ 2 ప్రారంభించి

Published: Monday January 30, 2023
ఇబ్రహీంపట్నం నియోజవర్గం తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో ని కమ్మ గూడెంలో తుర్కయంజాల్ మున్సిపల్ కౌన్సిలర్ తెలంగాణ పిసిసి సభ్యులు కాకుమాను సునీల్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  అశోక క్రికెట్ 2 కప్ టోర్నమెంట్లో  క్రీడాకారులు పాల్గొన్నా   పది జట్లు తో 170 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ పిసిసి సభ్యులు కౌన్సిలర్ కాకుమాను సునీల్  తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ టిపిసిసి  రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని క్రీడాకారులను దూషించి మాట్లాడుతూ. భవిష్యత్తులో క్రీడారంగం యువతకు మార్గదర్శకంగా ఉంటుందని ఆయన అన్నారు. క్రీడారంగం మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుందని. ఎదుగుదలకు తోడ్పడుతుంది క్రికెట్ క్రీడారంగం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం క్రీడా స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఎక్కడ ఏసిన గొంగళి చందంగా ఉందని ఈ ప్రభుత్వం పైన మండిపడ్డారు.   క్రీడాకారులకు నైపుణ్యతకు చేయూతను ఇవ్వాలని యువత గెలుపు ఓటమిన్ సహజమేనని క్రీడాకారులు నైపుణ్యత చాటుకోవాలని క్రికెట్ టోర్నమెంట్ ఉదేశమని మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్రీడాకారులు కమ్మగూడ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  .