మున్సిపాలిటీలో పలు వార్డుల్లోఆసరా పెన్షన్ పంపిణీ మధిర రూరల్ సెప్టెంబర్11 ప్రజా పాలన ప్రతిని

Published: Monday September 12, 2022
మున్సిపాలిటీ లోని 5,6,7 వార్డుల్లో కొత్తగా మంజూరు అయిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుతలారి చక్రయ్య  దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీ.ఆర్.ఎస్ నాయకులు
అర్హులందరకీ ఆసరా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు మేడికొండ కళ్యాణి, తొగురు వరలక్ష్మి* పేర్కొన్నారు. ఆదివారం నాడు మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో 5,6,7 వార్డుల్లో కొత్తగా మంజూరు అయిన ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అందించే పింఛను డబ్బులను రెట్టింపు చేసి ఇస్తున్నారని తెలిపారు అలానే వయోపరిమితి 57 ఏండ్ల కు తగ్గించి అర్హులకు ఆసరా పింఛన్లు మంజూరు చేసి అందిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనం అందరం అండగా నిలవాలని కోరారు.తలారి చక్రయ్య  దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీ.ఆర్.ఎస్ నాయకులు మున్సిపాలిటీ లోని మడుపల్లి నందు నేడు జరిగిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తలారి చక్రయ్య  దశదిన కర్మ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ  అధ్యక్షులు కనుమూరు  వెంకటేశ్వరరావు మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, తోగరు ఓంకారు, మేడికొండ కిరణ్, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు జల్లా కృష్ణారావు, గుండాల సర్వయ్య, నాగబాబు, గద్దల నాని, రాజా, జేవీ రెడ్డి, జిల్లా వెంకటేశ్వర్లు, పంగా శేషగిరి మరియు మున్సిపాలిటీ సిబ్బంది శుభకర్, గోపి, కృష్ణ, తదితరులుపాల్గొన్నారు