ప్రజా సేవే పరమార్థం: 15వ వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంత రెడ్డి

Published: Monday March 29, 2021
వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి 28 ( ప్రజాపాలన ) : రాజకీయ నాయకుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వార్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని 15వ వార్డ్ కౌన్సిలర్ అనంతరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 15 వార్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కాంక్రీట్ సిమెంట్ ఇసుకను వేసే నిష్పత్తిలో ఎలాంటి తేడా రానీయకూడదన్నారు. మున్సిపల్ మున్సిపల్ ఇంజనీర్ సూచించిన విధంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని వివరించారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ పరిష్కరించగలిగితే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడారు. ప్రజల కొరకు తాను చేసే మంచి పనులే ప్రజాదరణకు నోచుకుంటాయని వివరించారు. పదిహేనవ వార్డు కు సంబంధించిన కాలనీల అన్నింటిలోనూ అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు.