ఆరోగ్య తెలంగాణ లక్ష్యం గా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు.. --ఎమ్మేల్యే డా.సంజయ్.

Published: Saturday October 08, 2022

జగిత్యాల, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): ఆరోగ్య తెలంగాణ లక్ష్యం గా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలనని ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 17మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అందజేసినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా వైద్యం అందించడం జరిగింది అని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ లో గతంలో కంటే అధిక వ్యాధులను నేడు చికిత్స చేస్తున్నామని అన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, జిల్లా కౌన్సిలర్ ఫోరం అధ్యక్షులు పంబాల రామ్ కుమార్, కౌన్సిలర్ కోరే గంగ మల్లు, ఎఫ్ సిఎస్ డైరెక్టర్ అరుముళ్ల పవన్, నాయకులు తిరుమల య్య, నాచుపల్లి రెడ్డి, కొల గానీ సత్యం, అంజయ్య గౌడ్, శ్రీనివాస్, కోటేశ్వర రావు, వంశీ బాబు, మనోహర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.