అకాల వర్షం - అపార నష్టం. ..పోంగి పొర్లుతున్న వాగులు ,నీట మునిగిన కాలనీలు . ... జన జీవనం అస్థావ్యస్థ

Published: Thursday July 14, 2022
మంచిర్యాల టౌన్, జులై 13, ప్రజాపాలన : 
 
మంచిర్యాల జిల్లాలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలో ని రెడ్డి కాలనీ , ఎల్ఐసి కాలనీలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జన జీవనం అస్థావ్యస్థం కాగ జిల్లా కలెక్టర్ సహాయ క చర్యలను ముమ్మరం చేశారు.  అధికార యంత్రాంగం బాధితులను ఆదుకునెం దుకు చర్యలు తీసుకుంటు న్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రవహిస్తున్న రాళ్లవాగు, గోదావరి నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలైన రామ్ నగర్, కాలేజీ రోడ్, సాయి కుంట, ఇంధీరానగర్, కాకతీయ కాలనీ,  ఆదిత్య ఎంక్లేవ్,ఎల్ఐసి కాలనీ, మేదర్ వాడ, పాత మంచిర్యాల లోని లోతట్టు ప్రాంతాలు నీటి మునిగి పోయాయి., ఇండ్లలోకి వరద నీరు రావడంతో  అపార నష్టం వాటిల్లింది, వారిని పునర్వాస కేంద్రాలకు పంచాయతీరాజ్, పోలీస్,  మున్సిపాలిటీ సిబ్బంది సంయుక్తంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్కార పరిస్థితిలో ఉన్న ప్రజలకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నాయకులు వారికి సహాయక సహకారాలు అందించారు. ఈ వర్ష ప్రభావం ఇంకా రెండు రోజుల వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరిశీలించారు, ఎగువ ప్రాంతాల నుంచి నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. , అత్యవసర పరిస్థితులలో ప్రజలకు అన్నివేళలా అధికారులు అందుబాటులో ఉండులాగున చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చూసించారు.