పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు మార్గదర్శకాలు-కలెక్టర్ పమేలా సత్పతి

Published: Wednesday October 19, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 17 ప్రజాపాలన:
10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించుట కొరకు కార్యాచరణ ప్రణాళిక 2023 ను తయారు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వు సంఖ్య : 1802/డిసిఇబి/2027.  ద్వారా తెలిపారు. 
 
2022-23 నుండి పరీక్షలలో సంస్కరణలు ప్రవేశ పెట్టిన తర్వాత విద్యార్ధులు మార్కులు ప్రాధాన్యత కాకుండా సమగ్ర మూర్తిమత్వం సాధించుటకు నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టడం జరిగినది.
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరములో 10 వ తరగతి ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానములో ఉండాలని ఆకాంక్షిస్తూ  శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్ మార్గదర్శకం ఏర్పాటు చేశారు.పదవ తరగతి ఫలితాల్లో సఫలీకృతం అగుటకు 1.10.2022 నుండి 100 రోజుల సంసిద్ధతా ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు.
 ప్రభుత్వ యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల ఉపాధ్యాయ బృందంతో సమావేశం ఏర్పాటు చేసుకొని, ప్రత్యేక తరగతుల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు.పర్యవేక్షణ అధికారులు అందుబాటులో ఉండునట్లు చూసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లి దండ్రులకు ప్రత్యేక తరగతుల గురించి సమావేశం ఏర్పాటు చేసి వివరించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారంగా అందరు విద్యార్థుల శ్రేయస్సు కొరకు ఉత్తమ ఫలితాలు సాధించుటకై తేది: 17.10.2022 నుండి ఉదయం 8.30 నుండి 9.30 వరకు మరియు తేది: 02.01.2023 నుండి ఉదయం 8.30 నుండి 9.30 వరకు, సాయంత్రం 4.30 నుండి 5.30 గం.ల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించ వలసినదిగా  విద్యాశాఖాధికారి ఛైర్మన్ డిసిఇబి కె. నారాయణ రెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి ఉత్తర్వులు జారీచేశారు.
 
 
 
Attachments area