ఘనంగా పొగాకు యాదగిరి 9వ వర్ధంతి

Published: Thursday March 24, 2022
మంచిర్యాల టౌన్, మార్చి 23, ప్రజాపాలన: పొగాకు యాదగిరి 9వ వర్ధంతి బుదవారం రోజున మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీ లో గల తెలంగాణ బీసీ జాగృతి కార్యాలయంలో కీ"శే" పొగాకు యాదగిరి 9వ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్  మాట్లాడుతూ బిసి బిడ్డ మంచిర్యాల వాసి అయినటువంటి పొగాకు యాదగిరి ఎమ్మెల్సీగా మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ మహనీయునికి యావత్ బీసీ సమాజం పక్షాన ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి జాగృతి పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, యువ జాగృతి అధ్యక్షులు మాచర్ల సదానందం, సహాయ కార్యదర్శి బది శ్రీనివాస్, గుమ్ముల సుదర్శన్, సీనియర్ నాయకులు సల్ల విజయ కుమార్, ముచ్చ కుర్తి భూమేష్, బిట్రగుంట రాంబాబు, మామిడాల ప్రకాష్, మామిడాల సాయి, తదితరులు పాల్గొన్నారు