ప్రతి భారతీయుడు సగర్వంగా జెండాపండుగాను జరుపుకోవాలి ఇంటూరి శేఖర్..

Published: Monday August 16, 2021
పాలేరు, ఆగస్టు 15, ప్రజాపాలన ప్రతినిధి : చేగొమ్మ సొసైటీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగుర వేసిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ఐకమత్యం, అభివృద్ధి లక్ష్యాల వైపు పూర్తి స్థాయిలో అధిగమించాలి ప్రతి భారతీయుడు సగర్వంగా జెండాపండుగాను జరుపుకోవాలి కూసుమంచి మండలం చేగొమ్మ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దాస్య శృంఖలాలను ఛేదించి ఎందరో ప్రాణత్యాగధనుల పుణ్యఫలం మనం అనుభవించే స్వాతంత్ర్యం. అన్నారు స్వతంత్రం సిద్దించి భారత జాతికి పెనుమార్పులు సంభవించినాయని ఇంక మనమనుకున్న ఐకమత్యం, అభివృద్ధి లక్ష్యాలవైపు పూర్తిస్థాయిలో అధిగమించాల్సిన అవసరం ఎంతైనాఉందని శేఖర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, నీటిపారుదల ప్రాజెక్టులు శాంతిభద్రతలు ప్రజా సంక్షేమ పతకాలు, ఆసరా కళ్యాణలక్ష్మి దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఐకమత్యం సహజీవనం ప్రతి పౌరునికి రక్షణ, అందరి జీవితాల్లో ఆనందాలు పంచాలని, కరోనావైరస్ ను అధిగమించాలని మాస్క్, భౌతిక దూరం తో అప్రమత్తంగా ఉండాలని  ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకొని భారత జెండా పండుగను జరుపుకోవాలన్నారు.