ఊరూర పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి..

Published: Monday February 14, 2022
జన్నారం రూరల్, పిబ్రవరి 13, ప్రజాపాలన : ఊరూర పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాల నిమోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరుకల రాజుగౌడ్ అన్నారు. జన్నారంలో గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) అధ్వర్యంలో ఈనెల 20 సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం పురస్కరించుకుని మాట్లాడారు. గత మూడువందల యాభైసంవ్సరాల క్రితమే మావోఇజం, మార్కిజం, సోషలిజం లేని సమయంలో అప్పటి మోగల్ సామ్రాజ్య నిరంకుశపా లనకు వ్యతరేకంగా పన్నెండు మందితో ఊరూర పోరువిత్తనలు నాటారని అన్నారు. బడుగు బహీనవర్గాలలో గుండెల్లో చైతన్యం నింపి పన్నెండువేల సైన్యంగా తయారుచేసి మోగలు సామ్రాజ్యంలో వణుకుపుట్టించారని, ఒక్కొక్క కోటను తనవశం చేసుకోని ఆ కోటలకు బడుగు బహీనవర్గాలను సామంత రాజులుగా నియమించాడని అన్నారు. అదేవిధంగా గోల్కొండ కోటనుకూడా తనవశం చేసుకొని కోన్ని సంవత్సరాలు పరిపాలించి, తన హయాంలో చేతివృత్తుల వారికి, రైతులకు బడుగు బలహీన వర్గాలుకట్టే అప్పటి ప్రభుత్వ కిస్తులను రద్దు చేశారని, అభివద్ధికి యెంతోకృషి చేశారని అన్నారు. ఇలాంటి మహానుభావుడి విగ్రహం జన్నారంలో నిర్మించినందుకు సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమనికి విజయవంతం చేయడానికి విచ్చేయుచున్న మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేని నర్సాగౌడ్ మరీయు గౌరవ అతిథులు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ అబ్కారీ యువజన సంస్కృతిక పురావస్తు టూరిజంశాఖల మంత్రివర్యులు విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రా దేవాదాయ ధర్మాదాయ అటవీ న్యాయశాఖల మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పి  చైర్మన్ వల్లకొండ శోభ సత్యనారాయణగౌడ్ అలాగే మంచిరియల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మరియూ మోకు దెబ్బ జాతీయ రాష్ట్ర  ఉద్యమ నాయకులు రాగుల సిద్దిరాములు గౌడ్, సిపతి లింగగౌడ్ లక్షేటిపెట్ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, జన్నారం జడ్పీటిసి ఎర్ర చంద్ర శేఖర్, పొన్కల్ సర్పంచ్ జక్కు భుమేష్ ఈ కార్యక్రమనికీ హాజరు అవుతున్నందుకు వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.