మధిర పట్టణంలో Ci మురళి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ.

Published: Wednesday February 23, 2022
మధిర ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : మధిర సర్కిల్ లో పనిచేసే ఎస్సైలు చేత  పకడ్బందీగావాహనాలు చెకింగ్. ప్రధాన కూడళ్లలో విస్తృతంగా వాహన తనికీలు. ఖమ్మం సిపి ఆదేశాల మేరకు వైరా ఏసిపి సూచనలతో మధిర ci మురళి ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రధానంగా మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భావించి వాహనాలు తనిఖీ చేపట్టడం జరుగుతుందని సిఐ మురళి పేర్కొన్నారు. వాహనదారులు మీ వాహనాలకు పత్రాలు లేకుండా ప్రయాణించేవారికి,డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి హెల్మెట్లు లేకుండా ప్రయాణించే వారికి, డ్రంక్&డ్రైవ్ చేసే వారికి, వాహనాలు నడిపే మైనర్లుకు జరీమానాలుతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు వారు తెలిపారు. వాహనాలు ను మైనర్లుకు ఇచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వాహనాల తనిఖీలో మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్, ఎర్రుపాలెం ఎస్ఐ ప్రసాద్ బోనకల్ ఎస్ఐ కవిత, మధిర రూరల్ ఎస్ఐ ప్రియాంక పాల్గొన్నారు.