మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించండి - ఎంపీపీ జమున

Published: Monday April 26, 2021
సారంగాపూర్, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : సారంగాపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోల జమున శ్రీనివాస్ మండల ప్రజలకు సలహాలు సూచనలు చేస్తు నా ప్రజలందరు కరోనా మహమ్మారి నుంచి బయట పడాలని ఎవరికి కూడ హాని కలుగవద్దని అందరూ క్షేమంగా ఉండాలని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. సమస్త మండల ప్రజలు ఎవరి ఇంట్లో వారు ఉండలని కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు భౌతిక దూరం పాటించి శానిటైజర్ ఉపయోగించి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జమున సూచించారు.