కెసిఆర్ సారథ్యంలో పల్లెలు అభివృద్ధి _ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్

Published: Wednesday March 01, 2023
జన్నారం, ఫిబ్రవరి 28, ప్రజాపాలన: గ్రామంలోని ప్రతి వీధికి సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని మొర్రిగూడెం,పొన్కల్, రొటిగూడ,తిమ్మాపూర్ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్ గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధర్వంలో ప్రతి గ్రామంలోని ప్రతి విధికి సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టి సస్యశ్యామలం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. ప్రతి ఇంటికి కెసిఆర్ సంక్షేమ పథకం చేరుతుందని అన్నారు.  అదేవిధంగా నిజామాబాదులో మేడికో సూసైడ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వారి స్వగ్రామం అయిన చింతగూడ వెళ్లి ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరమశించారు, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ, కాంతామణి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్, జన్నారం ఎంపీటీసీ రియాజ్ ద్దీన్ , పోనకల్ సర్పంచ్ జక్కు భూమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు భరత్ కుమార్, ముత్యం సతీష్,  మండల ప్రజా ప్రతినిధులు నాయకులు,  కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.