కార్మికుల సంఘర్షణ యాత్ర విజయవంతం చేయాలని

Published: Wednesday January 04, 2023
 చేవెళ్ల: (ప్రజాపాలన)
చేవెళ్ల మండల కేంద్రంలో రవాణా రంగా కార్మికుల సమస్యలపై సిఐటియు నేటి నుంచి 11 వ తారీకు వరకు జరిగే సంఘర్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా: సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ జిఎస్టి పరిధిలో కి తీసుకురావాలని రవాణా రంగ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అర్హులైన వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల ఆరవ తారీకు చేవెల్లకు రవాణా సంఘర్షణ యాత్ర వస్తుందని దానిని విజయవంతం చేయాలని చేవెళ్ల మండలానికి చెందిన రవాణా రంగ కార్మికులు ఆటో డ్రైవర్లు. టాక్సీ డ్రైవర్లు. డిసిఎం డ్రైవర్లు. టాటా ఏస్ డ్రైవర్లు కు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ జిల్లా నాయకులు మెగావత్ లక్ష్మణ్ నాయక్. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్. ఆటో యూనియన్ నాయకులు నర్సింలు గౌడ్. రవి.సురేందర్. తదితరులు పాల్గొన్నారు.