ఉప్పల్ డివిజన్ సమగ్రాభిద్ధికి కృషి చేస్తా : ఎంపీ రేవంత్ రెడ్డి

Published: Friday June 04, 2021
మేడిపల్లి, జూన్3 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ డివిజన్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రేవంత్ రెడ్డి హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ మేరకు ఉప్పల్లోని హరిజన బస్తీలో రూ.22.50 లక్షలతో ఎస్సీ మహిళా భవనం, ఒల్డ్ విలేజ్ ఇందిరా నగర్లో రూ.42 లక్షలతో షాదీఖానా భవనం, కిష్టారెడ్డి కాలనీలో రూ.55 లక్షలతో ఆర్.సి.సి బాక్స్ కల్వర్ట్ నిర్మాణం, లక్ష్మినారాయణ కాలనీలో రూ.26.50 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంఖుస్థాపనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, ఏఈ వసంత, హెచ్ఎండబ్ల్యుఎస్ అధికారులు జాన్ షరీఫ్, శ్రీధర్ రెడ్డి, నాయకులు బాకారం లక్ష్మణ్, బోరంపేట కృష్ణ, తవిడబోయిన గిరిబాబు, తెల్కల మోహన్ రెడ్డి, గడ్డం రవి కుమార్, లక్ష్మీనారాయ కాలనీ అధ్యక్షులు లూకాస్, బొడ్డు రవీందర్, రాములు, గోపాల్, అశోక్ గౌడ్, ఏసురి యాదిగిరి, గుండె సాయిలు, ఏసురి మల్లేష్, సి డి వెంకట్, తోకత నర్సింహా, నరేష్ తోకత మల్లేష్, తోకత రాజు, గుండె రాజు, సుక్క జీవన్ తదితరులు పాల్గొన్నారు.