ఇబ్రహీంపట్నం గోశాలలో ఖాదీ గ్రామీణ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం

Published: Monday September 20, 2021

ఖాదీ గ్రామీణ పరిశ్రమల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ పేరాల శేఖర్ రావు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని గోపాల గోశాల, గాంధీ గ్లోబల్   సంస్థలు, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం, ప్రకృతి సెలయేరును శనివారం నాడు ఖాదీ గ్రామీణ పరిశ్రమల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ పేరాల శేఖర్ రావు, ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్, మాజీ ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి లక్ష్మణ్, గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ రాజేందర్ రెడ్డి, దశరథ గౌడ్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల గో సేవా ప్రముఖ్ యంపల్ల సుధాకర్ రెడ్డి గోపాల్ గోశాల ను సందర్శించారు. గోపాల్ గోశాలలో గోవుల నుండి తయారుచేస్తున్న ఉత్పత్తులను గోధూళితో తయారయ్యే గోబర్ గ్యాస్, పాల ఉత్పత్తి, గోసంరక్షణ మరియు ప్రకృతి సెలయేళ్ళు, పచ్చిక బయళ్లు, నీటి వనరులు, ప్రకృతి రమణీయాన్ని చూసి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా పేరాల శేఖర్ రావు మాట్లాడుతూ తూ ప్రతి గోశాల స్వయం సమృద్ధ మైనటు వంటి ఒక ఆర్థిక వ్యవస్థగా అది గోశాల మారవచ్చని అన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్, అగర వత్తులు, పేస్టులు, సబ్బులు, షాంపూలు తయారీ గోసంరక్షణ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల 80 గోశాలల ద్వారా సదస్సును నిర్వహించి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాల ఏర్పాటు చేయవచ్చని  అలాంటి  వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కె వి హెచ్ పి ద్వారా చొరవ తీసుకోవాలనీ నిర్ణయించామని అన్నారు. ప్రాచీన కులవృత్తులకు సంబంధించిన కుమ్మర, కం సాలి, చాకలి, మంగలి, ఇతర కులాలకు అత్యాధునికంగాకంగా యంత్రాలతో వస్తువులు తయారు చేసే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ సెంటర్ ను ముందుకు తీసుకు వెళతామని తెలియజేశారు. భారతీయ శాస్త్ర విజ్ఞానంతో దేశీ కోళ్లు, దేశ సంపద, డెవలప్ చేయడం సమాజంలో అందరూ ఆ స్థితికి వచ్చేలాగా పరిశోధన చేయడం ద్వారా ఈ గోశాల ప్రాంతాన్ని ఒక పరిశోధన కేంద్రంరీ (సెర్చ్ సెంటర్) గా మార్చవచ్చని అన్నారు. భారతీయమైన విజ్ఞాన సంపద ను పంచేందుకు 100 ఎకరాలలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే కోరిక గున్న రాజేందర్ రెడ్డి కి ఉందని గుర్తు చేశారు. 10 ఎకరాల్లో  చేనేత వస్త్రాలు తయారీ కోసం ఖాళీ పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తామని అదేవిధంగా గా గ్రామీణ కుల వృత్తుల కోసం అనేక ఆధునికయంత్రాలను కొంతమందికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. కుమ్మరులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు ఇక్కడ 100 రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని పశువుల పేడ మూత్రము తదితర సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే చాలామందికి ఉపాధి దొరుకుతుందని పేరాల శేఖర్ రావు పేర్కొన్నారు.