మండలంలో లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించిన డిసిపి

Published: Thursday May 13, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి అమలు పరుస్తున్న లాక్ డౌన్ ను మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి డిసిపి నారాయణ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రెండవ దశ ఉదృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం 10 రోజులు లాక్డౌన్ విధించిందని, జిల్లా వ్యాప్తంగా 18 పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 700 మంది పోలీస్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తూ ప్రజలు కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారని, ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని, వ్యవసాయ పనులకు, ఆసుపత్రులకు, ఉపాధి హామీ పనులకు వెళ్లే వారికి అనుమతిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సిఐ శ్రీనివాస్, స్థానిక ఎస్సై రాఘవేందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.