కోర్టు నూతన భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి న్యాయవాదులు డిమాండ్. మధిర రూరల్ అక్టోబర్ 10 ప్ర

Published: Tuesday October 11, 2022
పశువుల ఆసుపత్రిలో కోర్టు.. ఇంకా ఎంతకాలం ఈ అవస్థలు.హామీలకే పరిమితమైన మధిర కోర్టు నూతన భవన నిర్మాణం.పశువుల ఆస్పత్రిలో ఇక విధులు నిర్వహించలేమని తేల్చి చెబుతున్న న్యాయవాదులు.కోర్టు నూతన భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ  నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన న్యాయవాదులు. ఈ సందర్భంగాాా వారు
మాట్లాడుతూఎంతో రాజకీయ చైతన్యం ఉన్న మధిర ప్రాంతంలో నిజాం కాలం నుండి సుదీర్ఘకాలంగా మధిర కోర్టు ప్రజలకు అందుబాటులో ఉంది. కాలక్రమమైన ఈ భవనంకాస్తశిథిలావస్థకుచేరడంతోన్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్కు, జిల్లా న్యాయమూర్తికి వినతి పత్రాలు అందజేసి నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరడంతో నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు అన్ని విధాల సిద్ధమై బడ్జెట్ కేటాయించడం జరిగిందని పేర్కొని నేటికీ సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు మధిర కోర్టు నూతన భవన పనులు చేపట్టకపోవడం సోషనీయమని న్యాయవాదుల పేర్కొంటూ వెంటనే నూతన భవనాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె కు న్యాయవాదులు ఈ రోజు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పశువుల ఆసుపత్రిలో నడుస్తున్న కోర్టులో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కక్షిదారులు కూడా సరైన వసతులు లేవని వారు వాపోతున్నారు. పశువుల ఆసుపత్రిలో దుబ్బర పరిస్థితుల్లో  విధులు నిర్వహించాల్సి వస్తుందని వాపోతున్నారు. నూతన కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ నూతన భవనం నిర్మాణం చేపట్టానికి ఎందుకు జాప్యం జరుగుతుంది. దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదు అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. పశువుల ఆస్పత్రి కోర్టు భవనంలో విధులు నామమాత్రంగా నిర్వహిస్తూ భోజన సమయం శిథిలావస్థ కోర్టులోనే జరుపుతున్నామని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన కోర్టు నిర్మాణ పనులను  చేపట్టాలని కోరుతూ నేటి నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోజడ్ల పుల్లారావు, న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, నంబూరి జనార్దన్ రావు, దిరిశాల జగన్ మోహన్ రావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, సుంకు మోహన్ దాస్, బైరాభట్ల శ్రీనివాస్, నెల్లూరు రవి, కావూరి రమేష్, చింతల గోపాల్, జింకల రమేష్, వెంకట్రావు, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.