ఫ్రైడేడ్రైడేని పకడ్బందీగా నిర్వహించండిక్షయ వ్యాదిగ్రస్తులకు సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించం

Published: Saturday July 30, 2022

ఆకస్మికంగా తనిఖీ చేసిన పోగ్రామ్ ఆఫీసర్ డా. వి సుబ్బారావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున జిల్లా క్షయ నివారణ అధికారి మరియు ఫ్రైడే - డ్రైడే స్పెషల్ ఆఫీసర్ డా.వరికూటి సుబ్బారావు మధిర డివిజన్ పరివేక్షణలో భాగంగా బనిగండ్ల పాడు దెందుకూరు మాటూరు పేట పిహెచ్సి ల సిబ్బంది పని తీరును తనిఖీ చేసే విధానంలో భాగంగా శుక్రవారం ఉదయం పిహెచ్సి దెందుకూరు పరిధిలో మధిర మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న ఎస్సి కాలనీ లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాల పారిశుధ్యo గురించి ప్రజలకు పారామెడికల్ సిబ్బందికీ పలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఎస్సి కాలనీ ఉన్న టీబీ కేసులు మందుల వాడకం ట్రీట్మెంట్ కార్డు మరియు టీబీ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి గమనించి పారామెడికల్ సిబ్బంది పనితీరు లోటు పాట్లు వారికీ వివరించారు. టీబీ కేసులు ఎవరు డిఫల్టర్ కావద్దు అని 100% ట్రీట్మెంట్ పూర్తి చేయించాలి అని వారికీ రావాలిసిన పోషకాహర పారి తోషకం సక్రమంగా అందేవిధంగా చూడాలని పేషెంట్ కీ మందులు ఏ రోజుకు ఆరోజు స్వయంగా డాట్ ప్రొవైడర్ డైరెక్ట్ అబ్సర్వేషన్ ట్రీట్మెంట్ ద్వారా మ్రింగించాలి అని సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డా. సుబ్బారావు వెంట పిహెచ్సి వైద్యులు డా.శశిధర్ పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఇఒ గోవింద్ హెచ్ఎస్ సుబ్బలక్ష్మి టీబీ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ సందీప్ ల్యాబ్ సూపర్ వైజర్ శివ, టీబీ డీటీసీఓ విభాగం టీబీ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ సతీష్ టీబీ నోడల్ పర్సన్ లంకా కొండయ్య ఎఎన్ఎమ్ లు వి విజయ కుమారి ఆర్ విజయలక్ష్మి ఆశ కార్యకర్తలు ప్రశాంతి సమీప సుజాత మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.