నారాయణపూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

Published: Wednesday June 08, 2022
 ప్రత్యేక అధికారి నాగరాజు
వికారాబాద్ బ్యూరో జూన్ 07 ప్రజాపాలన : నారాయణపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేస్తున్నామని గ్రామ ప్రత్యేక అధికారి నాగరాజు అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించుటకు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని గ్రామ ప్రత్యేక అధికారి నాగరాజు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి లో భాగంగా స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్డు పల్లె ప్రకృతి వనం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం పారిశుద్ధ్యం హరితహారం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో నేడు ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నవని స్పష్టం చేశారు. ఇంటింటికి మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు ప్రజలు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు ఎంతో సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ రూపురేఖలు మారిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి పదంలో వివిధ రకాల మొక్కలతో చూడముచ్చటగా ఆకర్షణీయంగా మనసును రంజింప చేసే విధంగా నాటిన ప్రతి మొక్క ఏపుగా పెరిగింది స్పష్టం చేశారు. నారాయణ పూర్ గ్రామ ప్రజలు పల్లె ప్రకృతి వనములో హాయిగా స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందవచ్చని తెలిపారు. ఔషధ మొక్కల గాలితో మనసుకు శాంతితో పాటు  ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు ఉన్నారు.