31 వ డివిజన్ లో రాలి తో తడి పొడి హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన

Published: Wednesday April 07, 2021
బాలాపూర్, ఏప్రిల్ 06 ప్రజా పాలన ప్రతినిధి : స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లో భాగంగా నగర దీపికలు కలిసి తడి పొడి హానికరమైన చెత్తను పట్ల అవగాహన కల్పిస్తున్న కార్పొరేషన్ కమిషనర్, మేయర్ లు పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 31వ డివిజన్ శ్రీవిద్యా టౌన్ షిప్ కాలనిలో స్వచ్చ ర్యాలీ నిర్వహించి కాలనీ వాసులకు తడి, పొడి హానికర చెత్త పట్ల అవగాహన సమావేశంలో పాల్గొన్న మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. "స్వచ సర్వేక్షణ్ - 2021"లో భాగంగా నగర దీపికలు తడి, పొడి హానికరమైన చెత్త పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.... తడి, పొడి, హానికరమైన చెత్తను ప్రజలు ఇంట్లో వేరు చేయకుండా బహిరంగ ప్రదేశాలలో వేయవద్దని అలాగే వేయకుండా కూడా చూసుకోవసలిన బాధ్యత కూడా సాటి పౌరులుగా మన పైన ఉంది అని అన్నారు. ప్రస్తుత మారుతున్న సమాజంలో మనం కూడా మన వంతు స్వచ్ఛత కోసం కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వచ్ఛత కోసం ప్రతిజ్ఞ చేయించారు. అక్కడే స్థానికంగా హోమ్ గార్డెన్ నిర్వహిస్తున్న గృహాన్ని సందర్శించి ఇటు వంటి నూతన విధానాన్ని గృహిణులు ఏర్పాటు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి, స్వచ్ భారత్ మిషన్ కోఆర్డినేటర్ దేవేందర్, నగర దీపికలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ ప్రజలు  మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.