నాసిరకంగా నిర్మిస్తున్న చెక్ డ్యామ్ఆరు కోట్ల ప్రజాధనం వరద పాలునాసిరకం నిర్మాణాలపై సిపిఐ ఆగ

Published: Friday June 17, 2022
మధిర జూన్ 16 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి మధిర శివాలయం వద్ద వైరా నదిపై ఆరు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణ పనులు అత్యంత నాసిరకంగా కొనసాగుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగేందుకు వైరా నదిపై శివాలయం వద్ద చెక్ డ్యామ్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం గత సంవత్సరం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసింది టెండర్ పొందిన గుత్తేదారు నిర్మాణ పనులను పూర్తి చేశారు. నిర్మాణ పనులను సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు మడుపల్లి గ్రామ శాఖ కార్యదర్శి సిరివేరు శ్రీను గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మధిర వైరా నది మీద శివాలయం వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యామ్ కు రాత్రి కురిసిన వర్షం కారణంగా  లీకుల బాగోతం బయటపడిందని, చెక్ డ్యామ్ పై పగుళ్ల కూడా వచ్చాయని వారు విమర్శించారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం మొదటినుండి నాసిరకం మెటీరియల్ తో నిర్మాణం చేపడుతుందని సిపిఐ నాయకత్వం అధికారులను హెచ్చరిస్తూనే ఉందని తెలిపారు.
అధికారపార్టీ వత్తిడో, లేకపోతే ప్రజాప్రతినిధుల వత్తిడివలనో,లేకపోతే కమిషన్ల కక్కుర్తి పడో, నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు సరిగా పట్టించుకోక పోవడం వలన  కాంట్రాక్టర్ చెక్ డ్యామ్ నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టాలని వారు ఆరోపించారు. పదికాలాల పాటు మధిర పట్టణ ప్రజలకు త్రాగునీరు, అలాగే భూగర్భ జలాలు పెరగటానికి ఉపయోగపడుతుందనుకుంటే ఈ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ కు, అధికారులకు, అధికారపార్టీ వారికి కాసులు తెచ్చేదిగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకంగా నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ ను జిల్లా కలెక్టర్  పరిశీలించి సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దుచేసి అతనివద్ద నుండి రికవరీ చేయాలని, ఇందుకు కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉందా?ఉంటే మధిర ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులను  కాంట్రాక్టర్లు నాశిరకం నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. నాసిరకం నిర్మాణాలపై సిపిఐ పార్టీ దశలవారీగా ఉద్యమాలు చేపడుతుందని వారు పేర్కొన్నారు.