ఫ్రెంట్ లైన్ వారియర్స్ లకు ఉచితంగా కరోనా ట్రీట్మెంట్

Published: Friday May 21, 2021
మేడిపల్లి, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బస్ డిపో ఎదురుగా 21వ డివిజన్లో ఉన్న సేవ్ హాస్పిటల్ వారు కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులైన పేద ప్రజలకు మరియు ఫ్రెంట్ లైన్ వారియర్స్ అనగా మున్సిపల్, పోలీస్, మెడికల్, జర్నలిస్టులకు అండగా ఉండాలనే సామాజిక దృక్పథంతో తమవంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వ అనుమతితో 24 (కోవిడ్) పడకలతో నిర్వహిస్తున్న సేవ్ హాస్పిటల్ వారు ప్రైయివేట్ హాస్పిటల్స్ నందు చికిత్స చేయుంచుకొనుటకు స్తోమత లేని పేద ప్రజలకు మరియు ఫ్రెంట్ లైన్ వారియర్స్ మున్సిపల్ సిబ్బంది, పోలీస్, మెడికల్, జర్నలిస్టులకు మొదలగు వారికి ఉచితంగా కోవిడ్ చికిత్స అందింస్తామని ప్రకటించారు. తమ హాస్పిటల్ లో 3 పడకలను ఉచితంగా కోవిడ్ చికిత్సకు కేటాయించామని తెలియజేసారు. ఉచిత చికిత్స, సర్వీస్, పౌష్టిక ఆహారం, ఆక్సిజన్ మొదలగునవి పూర్తిగా ఉచితంగా అందిస్తామని తెలిజేసినారు. జంట మున్సిపల్ కార్పోరేషన్ మరియు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇట్టి అవకాశాన్నీ వినియోగించుకోవచని ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి మరియు మేయర్ వెంకట్ రెడ్డిల ప్రోద్బలం ఎంతో ఉందని సేవ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సామ రాజిరెడ్డి తెలియజేశారు. ఉచిత కోవిడ్ చికిత్స కొరకు 3 పడకలు కేటాయించిన సేవ్ హాస్పిటల్ యజమాని సామ రాజి రెడ్డిని మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, పిట్టల మల్లేష్, నాయకులు పప్పుల అంజిరెడ్డి  అభినందించారు. ఇదే సేవా దృక్పథంతో మరిన్ని హాస్పిటల్స్ వారు ముందుకు రావాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి కోరారు.